Monday, 1 June 2015

MOST LATEST NEWS ON PRC-2015 IMPLEMENTATION AND TRANSFERS OF ANDHRA PRADESH EMPLOYEES

Views

READ BELOW RELATED LINKS ALSO:

పీఆర్‌సీ ప్రయోజనాలకు మరికొంత సమయం పడుతుంది
ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక ఇబ్బందులున్నందున పదో వేతన సవరణ సంఘం ద్వారా రావాల్సిన వివిధ ప్రయోజనాలపై నిర్ణయాలు తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుందని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీవీరమేష్‌ అభిప్రాయపడ్డారు.
శుక్రవారం ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ఆయనను కలిసి పీఆర్‌సీ జీవోల జారీలో జరుగుతున్న జాప్యం గురించి వివరించినప్పుడు ఆయన పైవిధంగా స్పందించినట్లు అందులో పాల్గొన్న బృంద సభ్యులు తెలిపారు.

‘70 ఏళ్లకు అదనపు పింఛను, 300 రోజుల హాఫ్‌పేలీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, ఇతర అలవెన్సులు, మహిళా ఉద్యోగులకు రెండేళ్ల శిశుపాలన సెలవులు, పింఛనుదారులకు మెడికల్‌ అలవెన్సులపై పీఆర్‌సీ చేసిన సిఫార్సులు మంత్రివర్గ సమావేశం ముందుకెళ్లాల్సి ఉంటుంది.
మీకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినా 49శాతం ప్రయోజనం కలుగుతోంది.
ఇప్పుడు రాష్ట్రం పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అందువల్ల మీకు ప్రకటించిన 43% ఫిట్‌మెంట్‌కు ఇబ్బందులు లేకుండా చేస్తాం.
అదనపు ప్రయోజనాల విషయం మాత్రం మంత్రివర్గం ముందుకెళ్లాల్సి ఉంటుంది.
జేఏసీ నాయకులతో జూన్‌10 తర్వాత సమావేశం ఏర్పాటుచేసి ప్రభుత్వానికి ఎక్కడెక్కడ ఇబ్బందులున్నాయో చెబుతాం.
ఆ చర్చల సారాంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం’ అని ఆయన అన్నట్లు జేఏసీ నాయకులు చెప్పారు.
ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ జీవో ఇస్తే తప్ప పీఆర్‌సీ అమలు ముందుకుసాగదని ఉద్యోగుల నాయకులు తెలిపారు.
సీఎఫ్‌ఎంఎస్‌ విధానం వల్ల కొత్త వేతనాలు అందడం ఆలస్యమయ్యే ప్రమాదం కనిపిస్తోందని చెప్పగా ‘వివరాలు కచ్చితంగా సీఎఫ్‌ఎంఎస్‌లోనే నమోదు చేసుకోవాలి.
దానివల్ల మీకే లాభం ఉంటుంది’ అని రమేష్‌ సర్దిచెప్పినట్లు తెలిసింది.
ఆ తర్వాత జేఏసీ నాయకులంతా ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర దగ్గరకు వెళ్లి సమస్యలు వివరించారు.

>>>WAIT FOR GOOD NEWS...
0 Comments:

Post a Comment